చీరాల : వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయ నుండి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల నియోజకవర్గంలో మూడు రోజులపాటు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వైసిపి పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు తెలిపారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ ఆధ్వర్యంలో జరిగే నియోజకవర్గ పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో నీలం శ్యామ్యూల్ మోజెస్, వైసిపి మండల అధ్యక్షులు పిన్నిబోయిన రామకృష్ణ, వేటపాలెం అధ్యక్షులు కొలుకుల వెంకటేష్, అన్నంరాజు సుబ్బారావు, సలగల అమృతరావు, మద్దు ప్రకాశరావు, షేక్‌సుభాని, ఆదినారాయణ పాల్గొన్నారు.