బాపట్ల : కర్లపాలెం మండలం యజలి పంచాయతీలో రూ.7.50లక్షలతో నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భావన నిర్మాణానికి ఎఎంసి చైర్మన్ పి ఆంజనేయరాజు సోమవారం భూమిపూజ చేశారు. శాసన మండలి సభ్యులు, టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్ సహకారంతో నిధులు మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎంపిపి మాడ వెంకటరత్నం, టిడిపి మండల అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, మాజీ సర్పంచ్ గుండ్రేడ్డి శివ పాల్గొన్నారు.