చీరాల : నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అవసరమని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అడ్డగడ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఎంఎస్‌సి రసాయనశాస్ర్తవిభాగం విద్యార్ధుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. సభకు ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. విద్యార్ధులు హక్కులతోపాటు నైతిక బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలని చెప్పారు. విద్యార్ధులు సాంకేతిక నైపుణ్యాలతోపాటు సున్నితమైన నైపుణ్యం నేర్చుకోగలిగితేనే సమాజంలో రాణింగలుగుతారని పేర్కొన్నారు. సభలో ఎంఎస్‌సి రసాయనశాస్త్ర విభాగాధిపతి డి రాజు, అధ్యాపకులు పిఎస్ కిరణ్‌కుమార్, డాక్టర్ విఎస్ ప్రసాద్, కె లహరి, పి సౌమ్య, ఎం ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.