Home విద్య అంత‌ర్జాతీయ సెమినార్‌లో సెయింట్ ఆన్స్ విద్యార్ధి ప‌రిశోధ‌నాప‌త్రం

అంత‌ర్జాతీయ సెమినార్‌లో సెయింట్ ఆన్స్ విద్యార్ధి ప‌రిశోధ‌నాప‌త్రం

352
0

చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో ఇసిఇ చ‌దువ‌తున్న విద్యార్ధులు అంత‌ర్జాతీయ కాన్ఫ‌రెన్స్‌లో ప‌రిశోధనా ప‌త్రాన్ని స‌మ‌ర్పించార‌ని క‌ళాశాల సెక్ర‌ట‌రీ వ‌న‌మా రామ‌కృష్ణారావు తెలిపారు. చెన్నైఆదిప‌రాశ‌క్తి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన 7వ ఐఇఇఇ ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ క‌మ్యూనికేష‌న్ అండ్ సిగ్న‌ల్ ప్రాసెసింగ్‌లో ఆంద్ర‌ప్ర‌దేశ్ నుండి త‌మ క‌ళాశాల ఇసిఇ నాలుగో సంవ‌త్స‌రం విద్యార్ధులు పాల్గొన్న‌ట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి హ‌రిణి తెలిపారు. ఇసిఇ విద్యార్ధులు కె రాజేశ్వ‌రి, కె శ్రావ‌ణ్‌కుమార్‌, కె ఉమాదేవి, ఎం మౌన‌దీపిక‌, డి శ్యామ్‌ప్ర‌కాష్ సంయుక్తంగా మ‌ల్టి ప‌ర్‌ప‌స్ సెక్యురిటీ సిస్ట‌మ్ ఇన్ ఆటోమొబైల్ ఇండ‌స్ర్టీ అంశంపై ప‌రిశోధ‌నా ప‌త్రం రూపొందించిన‌ట్లు హెచ్ఒడి డాక్ట‌ర్ కె జ‌గ‌దీష్‌బాబు తెలిపారు. ఇసిఇ అధ్యాప‌కులు ఎ త్రినాధ‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌రిశోద‌నా ప‌త్రం రూపొందించిన‌ట్లు తెలిపారు.