Home విద్య రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు ఎంపికైన సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ కాలేజి విద్యార్దులు

రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు ఎంపికైన సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ కాలేజి విద్యార్దులు

328
0

చీరాల : రాష్ట్ర ప్ర‌భుత్వ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ టెక్నాల‌జీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌కు చెందిన మూడు టీముల విద్యార్ధులు ఎంపికైన‌ట్లు క‌ళాశాల సెక్ర‌ట‌రీ వ‌న‌మా రామ‌కృష్ణారావు, క‌ర‌స్పాండెంట్ ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు తెలిపారు. నేష‌న్ ఇన్‌స్ట్రుమెంట్స్ – ఇండ‌ట్ర్స‌య‌ల్ ఇన్‌ట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్ అంశంపై రాష్ట్ర‌వ్యాప్తంగా 465టీముల విద్యార్ధులు పాల్గొన్న‌ట్లు ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి ర‌వికుమార్ తెలిపారు. వీరిలో 95టీములు ప్రాజెక్టు సిములేష‌న్స్ అంద‌జేసిన‌ట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న 16టీముల్లో మూడు టీములు ఫైన‌ల్ రౌండ్‌కు ఎంపికైన‌ట్లు తెలిపారు. కంప్యూట‌ర్ సైన్స్ండ్ ఇంజ‌నీరింగ్ విభాగం 3, 4సంవ‌త్స‌రాల విద్యార్ధులు రూపొందించిన స్మార్ట్ ఇరిగేష‌న్ సిస్ట‌మ్ యూజింగ్ ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్‌, స్మార్ట్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్‌, స్మార్ట్ డ‌స్ట్‌బిన్ విత్ ఐఒటి నోటిఫికేష‌న్ ప్రాజెక్టులు ఫైన‌ల్ రౌండ్‌కు ఎంపికైన‌ట్లు సిఎస్ఇ విభాగాధిప‌తి డాక్ట‌ర్ పి హ‌రిణి తెలిపారు.

స్మార్ట్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ వ‌ర్టిక‌ల్ ఫార్మింగ్ ప్రాజెక్టును వై సౌజ‌న్య‌కుమారి ఆధ్వ‌ర్యంలో ఫ‌జ‌ల్ అహ్మ‌ద్‌, జె పోలేశ్వ‌ర్‌, రామ‌కృష్ణ రూపొందించిన‌ట్లు తెలిపారు. ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుతున్న నేప‌ధ్యంలో సార‌వంత‌మైన భూముల‌న్నీ నివాస గృహాలుగా మారిపోతున్నాయి. అందువ‌ల్ల సార‌వంత‌మైన పంట‌ల‌ను న‌గ‌ర ప్రాంతాల్లో పండించ‌టం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. ఇండ‌స్ర్టియ‌ల్ ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్‌లోని స్మార్ట్ ఆర్కిటెక్చ‌ర్‌ను ఉప‌యోగించుకుని ట్రేల ద్వారా ఒక‌దాని మీద ఒక‌టి ఉంచి ఎత్తైన భ‌వ‌న‌ముల‌మీద, కార్యాల‌యాల మీద కూర‌గాయ‌లు, వివిధ ర‌కాలైన పంట‌ల‌ను పండించ‌డం ద్వారా ప‌ర్యావ‌ర‌ణం కాపాడ‌టంతోపాటు నీటి వ‌న‌రుల‌ను ఆదా చేయ‌వ‌చ్చ‌న్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన ఫ‌ల‌సాయాన్ని పొంద‌వ‌చ్చ‌న్నారు.

స్మార్ట్ ఇరిగేష‌న్ సిస్ట‌మ్ యూజింగ్ ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్‌ను పి వెంక‌ట‌రనారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో ఆర్ భ‌వానీశంక‌ర్‌, వి మ‌ణికంఠ‌సాయిదీప్‌, పి వెంక‌ట‌నారాయ‌ణ రూపొందించార‌ని ప్రిన్సిపాల్ ర‌వికుమార్ తెలిపారు. ఆదునిక వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తుల్లో నీటిపారుద‌ల ప్ర‌ధాన పాత్ర‌వ‌హిస్తుంద‌న్నారు. నేల‌, వాతావ‌ర‌ణంలో తేమ‌శాతం పంట‌ల‌పై, ఫ‌ల‌సాయంపై ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. వివిధ ర‌కాల సెన్సార్ల‌ను ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా అనుసంధానం చేసి పంట‌ల‌కు త‌గిన నీటి సౌక‌ర్యం క‌ల్పిస్తే ఎక్కువ దిగుబ‌డి సాధించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

స్మార్ట్ డ‌స్ట్‌బిన్ విత్ ఐఒటి నోటిఫికేష‌న్స్ ప్రాజెక్టును డాక్ట‌ర్ శ్యామ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో పి సాయికీర్తి, వై మెర్సీ, ఎస్కె ఆర్యాజ‌బిన్‌లు రూపొందించార‌ని తెలిపారు. చెత్త‌ను పార‌వేసేందుకు ఉప‌యోగించే డ‌స్ట్‌బిన్‌ల‌ను ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా అనుసంధానం చేసి అవి నిండిన వెంట‌నే వాటికి సంబంధించిన అధికారుల‌కు స‌మాచారం చేర‌వేయ‌డం ద్వారా స‌కాలంలో శుబ్రం చేయించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం ప‌రిర‌క్ష‌ణ‌కు మేలు క‌లుగుతుంది. ఎంపికైన ప్రాజ‌క్టులు ఆఖ‌రి రౌండ్‌లో కూడా ఎంపికై బ‌హుమ‌తులు పొందాల‌ని ఆకాంక్షించారు.