Home ఉపాధి సెయింట్ ఆన్స్‌లో ఒమెగా హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్‌

సెయింట్ ఆన్స్‌లో ఒమెగా హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్‌

522
0

చీరాల : ప్ర‌కాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో మే3న ఒమెగా హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ సంస్థ ఎఆర్ కాల‌ర్స్‌, మెడిక‌ల్ కోడ‌ర్ ఉద్యోగాల కోసం క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌ళాశాల సెక్ర‌ట‌రీ వ‌న‌మా రామ‌కృష్ణారావు, క‌ర‌స్పాండెంట్ ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు తెలిపారు. త‌మ క‌ళాశాల‌లో బిటెక్ ఆఖ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్ధులు అర్హుల‌ని తెలిపారు. మెడిక‌ల్ కోడ‌ర్ ఉద్యోగాల‌కు త‌మ క‌ళాశాల‌లో బిఫార్మ‌సీ నాలుగో సంవ‌త్స‌రం మొద‌టి సెమిస్ట‌ర్ వ‌ర‌కు 55శాతం మార్కులు పొంది బ్యాక్‌లాగ్ లేని విద్యార్ధులు హాజ‌రు కావాల‌ని ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి ర‌వికుమార్ కోరారు. వివ‌రాల‌కు ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్ ఎన్ పూర్ణ‌చంద్ర‌రావును సంప్ర‌దించాల‌ని కోరారు.