చీరాల : మహాత్మాగాంధీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.2500విలువై నోటు పుస్తకాలను కొత్తపేట వడ్డెసంఘం ప్రాధమిక పాఠశాలలోని 56మంది విద్యార్ధులకు పంపిణీ చేశారు. పెన్సిళ్లు, పెన్నులు, రబ్బర్లు అందజేశారు. ఈసందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాతా సుబ్బారావు అధ్యక్షత వహించారు. సభలో పాఠశాల కమిటి ఛైర్మన్ డి ప్రమీల, మహాత్మాగాంధీ ఎంప్లాయిస్ అసోసియేషన్ వైస్ప్రెసిడెంట్ చారుగుళ్ల గురుప్రసాద్, కార్యదర్శి ఆలపాటి శ్రీనివాసరావు, డైరెక్టర్ దరిశి శ్రీనివాసరావు, చుక్కా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు పోపూరి రంగారావు, పి విజయానంద్, బి సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.