విశాఖపట్నం : మన్యంలో మావోయిస్టులు ఉనికిని చాటుకున్నారు. వైసిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే టిడిపిలో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరరావును కాల్చి చంపారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు అనుచరుడ్ని కాల్చి చంపారు. మావోయిస్టు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కిడారి ఘటనాస్థలంలోనే కన్నుమూశారు.
మావోయిస్టులు గతంలో కిడారి సర్వేశ్వరావును హెచ్చరిస్తు పోస్టర్లు వేశారు. ఈ నేపధ్యంలో కిడారికి ప్రాణహాని ఉందని పోలీసులు ముందే చెప్పారు. ఆపరేషన్లో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.