చీరాల : ఆర్టీసీ బస్టాండు ఆవరణలో న్యాయ సలహా కేంద్రాన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ టాగూర్ గురువారం ప్రారంభించారు. న్యాయ సహాయం అవసరమైన వారికి అందుబాటులో సేవలందించేందుకు సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం ఎం శ్రీనివాసరెడ్డి, ఎ రామకృష్ణ, డి శ్రీనివాసరావు, మల్లాది సాయిప్రసన్నకుమార్ పాల్గొన్నారు.