Home ఆంధ్రప్రదేశ్ అమరాజీవికి ఘననివాలి

అమరాజీవికి ఘననివాలి

423
0

చీరాల : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ముక్కోణంపార్కులోని అమరజీవి విహారహానికి పులమలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. అమరజీవి ఆత్మార్పణతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చెప్పారు. అమరజీవి స్పూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి సాధించాలని కోరారు.

కార్యక్రమంలో తమ్మన పవనకుమార్, కె రఘు, జి లాలితకుమారి, ఏ శ్రీనివాసరావు, సిహెచ్ హిందూమతి, ఏ చంద్రశేఖర్, సంకా శ్రీనివాసరావు, అమరా రాఘవరావు, ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మువ్వల వెంకట రమణారావు, వారణాసి మల్లికార్జునరావు, అరవపల్లి కుమార్, రామిశెట్టి కోటేశ్వరరావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను, సయ్యద్ ఆలింబాబు, గీత ట్రస్ట్ చైర్మన్ వలివేటి మురళీకృష్ణ పాల్గొన్నారు.