కందుకూరు : బాష ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టిడిపి రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణా శిభిరంలో అమరాజీవికి ఘన నివాళులు అర్పించారు. స్థానిక తెలుగువిజయం ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ శిభిరంలో 159వ బాచ్ ముగింపు కార్యక్రమంలో బాగంగా హాజరైన నాయకులనుద్దేసించి రాజా మాష్టారు మాట్లాడారు. విభజన హామీల సాధనే అమరజీవికి నిజమైన నివాళి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములుతో పాటు ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగా లభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ఆనాడు విడదీస్తే, ఈనాడు బీజేపి పెద్దలు విభజన హామీలను తుంగలో తొక్కి తెలుగు వారికీ అన్యాయం చేసారని ఆరోపించారు.
తెలుగు వారికీ అన్యాయం చేసిన కాంగ్రెస్కు 2014లో ఎ గతి పట్టిందో బీజేపికి కూడా 2019 సాదారణ ఎన్నికలలో అదే గతి పడుతుందని చెప్పారు. తెలుగు వారితో పెట్టుకున్న కాంగ్రెసుకు, బీజేపికి, ఈ రెండు పార్టీలతో జత కట్టాలని కపట నాటకాలు ఆడుతున్న వైసీపీకి, జన సేన తదితర పార్టీలకు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి ఎన్నికల కోసం సిద్దంగా ఉన్నారని అన్నారు. తెలుగు ప్రజల చిరకాల వాంఛ ఐన విభజన హామీల సాధన కోసం చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఉద్యమాలకు సిద్దంగా ఉండాలని కార్యకర్తలను కోరారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు జడ్పీటీసీ సభ్యులు కంచర్ల శ్రీకాంత్ చౌదరి, శిక్షకులు పసుపులేటి పాపారావు, చైతన్య, పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.