చీరాల : ఎదుటి వ్యక్తులతో సంభాషించే కళ ఉంటేనే భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని గీతా సంస్థ ఛైర్మన్ వలివేటి మురళీకృష్ణ అన్నారు. కొత్తపేట జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో నెక్ట్స్‌జెన్ స్టార్స్ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. పాఠశాల స్థాయిలో వక్తృత్వం, సెమినార్, బృంధచర్చలు వంటివాటిలో పాల్గొంటే సంబాషణానైపుణ్యం పెరుగుతుందన్నారు. చర్కగా వినగలిగినవారు చక్కగా మాట్లాడగలుగుతారని చెప్పారు. అలాగే చక్కగా చదవివే వాళ్లు భవిష్యత్తులో మంచి రచయితలుగా మారతారని చెప్పారు. విద్యార్ధులను ప్రోత్సహించేందుకు కథల పుస్తకాలను అందజేశారు. ఈసందర్భంగా విద్యార్ధులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు స్వాతంత్ర్యదినోత్సవ సభలో అందజేస్తారని ఉపాధ్యాయులు బండి బిక్షాలుబాబు, పవని భానుచంద్రమూర్తి తెలిపారు. సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ ఇందిరా ఇజ్రాయేల్ అధ్యక్షత వహఙంచారు.