చీరాల : చీరాల ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో తమిళనాడుకు చెందిన యూ ప్లస్ టెక్నాలజీస్ సంస్థ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. కళాశాల ఇసిఇ, ట్రిపుల్ ఈ విద్యార్ధులు వందమందికిపైగా హాజరయ్యారు. వీరిలో 15మంది టెక్నికల్, మౌఖిక పరీక్షలకు ఎంపికైనట్లు కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ యార్లగడ్డ తిరుసమీర్ తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు సంవత్సరానికి రూ.2లక్షలు వార్షిక వేతనం ఉంటుందని తెలిపారు.
ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధులను కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ తేళ్ల అశోక్‌కుమార్ అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యుక్తవయస్సులో విద్యార్ధులు ప్రలోభాలకు, ఆకర్షణకు గురికాకుండా బాగా చదువుకుని ప్రతివిద్యార్ధి ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. సమయం వృధా కాకుండా చదవివేవారు మాత్రమే గొప్పస్థాయికి వెళతారని చెప్పారు. భవిష్యత్తులో జరిగే ప్రాంగణ ఎంపికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధులకు నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఒడి ఎన్ సురేష్‌బాబు, యు ప్లస్ టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.