Home విద్య జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ భాను

జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ భాను

692
0

ఒంగోలు : జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ 2018-19 అకడమిక్ కోఆర్డినేటర్గా చీరాలకు చెందిన సైన్సు ఉపాద్యాయులు పవని భానుచంద్రమూర్తి నియమితులయ్యారు. ఈ నెల 10, 11తేదీల్లో తిరుపతిలో జరిగిన 26వ జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి వర్కుషాపుకు తాను హాజరైనట్లు తెలిపారు.

ఒంగోలులో జరిగిన సమావేశంలో డిఇఓ వీఎస్ సుబ్బారావు, సైన్సు అధికారి మావిళ్ళపల్లి శ్రీనివాసరావు అభినందించారు. గతంలో పర్చూరు ఉపవిద్యా డివిజన్ సమన్వయకర్తగా, రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు. ఎన్సిఎస్సి డివిజన్ స్థాయి అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

స్వేచ్ఛమైన, ఆరోగ్యమైన, హరితమైన దేశం కోసం శాస్త్ర, సాంకేతిక, సృజనాత్మక ఆలోచనలు అనే ప్రధానాంశంతో 2018, 2019 విద్యాసంవత్సరం ప్రాజెక్టులు చేయాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 18న జిల్లా స్థాయి జాతీయ సైన్సు సెమినార్ ను ఒంగోలు సెయింట్ థెరిస్సా స్కూల్లో జరిగుతుందని డిఇఓ వీఎస్ సుబ్బారావు తెలిపారు. ఆగస్టు 2న జరిగిన డివిజన్ స్థాయి సెమినర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను 18న ఉదయం 9గంటలకు హాజరుపర్చాలన్నారు.