చీరాల : ఎస్ఎస్‌సి 2018ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్ధులు 22మందికి 17మంది ఉత్తీర్ణులైనట్లు ఆదినారాయణపురం ఎఆర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవనం బద్రిరెడ్డి తెలిపారు. వీరిలో తెలుగు-86%, హింది-100%, ఇంగ్లీషు-100%, సోషల్ – 96%, గణితం-86%, సైన్సు-77% శాతం పైగా ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉపాధ్యాయ నియమకాల లేమితో సతమత మవుతూ కూడా మంచి ఫలితాలు సాధించుటకు కృషి చేసిన ఉపాధ్యాయులను, కష్టపడి చదివిన విద్యార్ధులను అభినందించారు. 8.3జిపిఎతో పాఠశాల ప్రధమ స్థానంలో నిలిచిన రెబ్బవరపు నివేదిత, 7.8జిపిఎతో ద్వితీయ స్థానం సాధించిన గోలి వెంకటేశ్వర్లు, బి.రత్నరాజు, 7.5జిపిఎతో తృతీయ స్థానంలో నిలిచిన జి.శివలీల, టి.సుభాష్ బాబును అభినందించారు. అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరావు, యం.పుష్పరాజు, యం శ్రీనివాసులరెడ్డి, శ్రీనివాసరావు, సబీహబేగం, కంప్యూటర్ టీచర్ రమ్య, ధనలక్ష్శి హజరత్ విధ్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.