Home జాతీయం న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌తో… కుదేలైన దేశీయ వ్యాపారం… రెట్టింపైన‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆదాయం

న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌తో… కుదేలైన దేశీయ వ్యాపారం… రెట్టింపైన‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆదాయం

609
0

– ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న భార‌త్‌లోనూ ఆన్‌లైన్ లావాదేవీలు
– ఆన్‌లైన్ విస్తృత‌మైతే మ‌రో రూ.3.5లక్షల కోట్ల వాణిజ్యానికి అవకాశం
– ఆన్‌లైన్ వ్యాపారానికి దేశంలో మూడు ప్ర‌ధాన అవాంత‌రాలు
– ఆన్‌లైన్ విస్తృతితో గ‌ల్లంత‌వ‌నున్న చిరు, స్థానిక వ్యాపారాలు

సోర్స్ (ఇంటర్నెట్‌) : దేశంలో నోట్ల ర‌ద్దు తర్వాత ఏర్ప‌డ్డ న‌గ‌దు కొర‌త‌ను అధిగ‌మించేందుకు, ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన టాక్స్‌ల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించే పేరుతో ప్ర‌భుత్వ‌మే ఆన్‌లైన్, న‌గ‌దు ర‌హిత లావాదేవీలు విస్తృతం చేయాల‌ని ప్ర‌చారం చేసింది. సాంకేతిక రంగంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయ‌డం మంచిదే. కానీ ఆ సాంకేతిక అభివృద్ది ఫ‌లాల‌ను మ‌న ప్ర‌భుత్వం, మ‌న ప్ర‌జ‌ల‌క‌న్నా అమెరికా కేంద్రంగా న‌డుస్తున్న అమెజాన్‌, ప్లిప్‌కార్ట్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌లే త‌న్నుక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం. వీటి ఫ‌లితంగా గ్రామీణ వ్యాపారాలు, చిన్న‌బొంబాయిగా పేరొందిన చీరాల వంటి ప‌ట్ట‌ణాల్లో సైతం వ్యాపారాలు దెబ్బ‌తినే ప‌రిస్థితి నెల‌కొంది.

ఇటీవ‌లే ఆన్‌లైన్ వ్యాపారాల‌పై బెయిన్ అండ్ కంపెనీ, గూగూల్ అండ్ ఒమిడ్యార్ సంస్థ‌లు సంయుక్తంగా చేసిన ఈ కామ‌ర్స్ వ్యాపార స‌ర్వే వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. వీటి స‌ర్వే ప్ర‌కారం ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ‌ల‌కు భారత్‌ బంగారు గని లాంటిదని పేర్కొన్నారు. భారతలో జరుగుతున్న ఆన్‌లైన్‌ కొనుగోళ్లే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌క‌టించాయి. భారత్‌లో ఆన్‌లైన్ సేవ‌లు విస్తృతం చేయంతోపాటు మ‌రింత అవ‌గాహ‌న పెంచితే మ‌రో రూ.3.5లక్షల కోట్ల వాణిజ్యానికి అవకాశం ఉన్నట్లు అంచ‌నా వేశారు. దేశంలో ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారి సంఖ్య కొంత‌మేర‌కు పెరగడంతో దాదాపు 50బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని విశ్లేషించారు. డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన పెరగడం, ఈ-కామర్స్‌ రంగంలో అవకాశాలు దండిగా ఉండటంతో సాధ్యమైందని తెలిపారు.

2017 ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఈ-కామర్స్‌రంగంలో దేశంలో దాదాపు 20బిలియన్‌ డాలర్ల అమ్మకాలు జరిగాయి. అమెరికాలో 459బిలియన్‌ డాలర్లు అమ్మ‌కాలు జ‌రుగ‌గా చైనాలో దాదాపు 935బిలియన్‌ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ప్ర‌పంచ ఆర్థిక రంగంలో రెండు ప్ర‌ధాన కేంద్రాలుగా ఉన్న అమెరికా, చైనాల‌తో పోల్చితే అమ్మకాల్లో తక్కువైనప్పటికీ ఈ ఏడాది మొత్తం అమ్మ‌కాల్లో భారత్‌ వాటా 2శాతం వరకూ నమోదైంది.

భార‌త దేశంలో ప్ర‌స్తుతం దాదాపుగా 30.9కోట్ల మంది ఇంట‌ర్నెట్‌ వినియోగదారు ఉన్నారు. వీరిలో 40శాతం మంది అంటే 160మిలియన్ల మంది ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుపుతున్నారని అంచ‌నా. వీరిలో 90శాతం మంది అంటే 140మిలియన్ల మంది ధనిక కుటుంబాలకు చెందిన వారే కావ‌డం విశేషం.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ దేశ‌జ‌నాభాతో పోల్చితో భారత్‌లో త‌క్కువ‌గానే ఆన్‌లైన్ వ్యాపారం ఉంది. ప్ర‌ధానంగా ఈ-కామర్స్‌ రంగం మూడు సవాళ్లను ఎదుర్కుంటోంది. మొద‌టిది గ్రామీణ ప్రాంతానికి చెందిన‌ ఎక్కుమందికి ఆన్‌లైన్‌ సేవల మీద అవగాహన లేక‌పోవ‌డం. రెండోది భారత దేశంలో ఇంట‌ర్నెట్‌ ఉపయోగించే మహిళల సంఖ్య తక్కువగా ఉండటం. మూడోది ఇంట‌ర్నెట్‌ సౌకర్యాలు తక్కువగా ఉండటం. వీటన్నింటినీ అధిగ‌మించ‌గ‌లిగితే భారత్‌లోనూ ఈ-కామర్స్‌ రంగం మరింత పెరుగుతుంద‌ని బెయిన్‌ అండ్‌ కంపెనీ అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

ఆన్‌లైన్ వ్యాపారాల‌కు దేశాన్ని వేదిక‌గా మారుస్తున్న మోడీ విధానాలు
దేశంలో మౌళిక అవ‌స‌రాల‌ను వ‌దిలి ఆన్‌లైన్‌, ఇంట‌ర్‌నెట్ రంగాల‌ను విస్తృతం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద మొత్తంలో ఖ‌ర్చుపెట్టేందుకు నిధులు కుమ్మ‌రిస్తుంది. అదే స్థాయిలో విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల‌పై నామ‌మాత్ర‌పు కేటాయింపులు చేస్తూ సాంకేతిక‌త‌వైపు ప‌రుగులు తీయ‌డం అంటే దేశంలో పేద‌లు, స‌గ‌టు మ‌నిషి అవ‌స‌రాలు తీర్చ‌డం ఎలా అవుతుంది? అంద‌మైన చొక్కా ధ‌రించి నిక్క‌రు వేసుకోవ‌డం మ‌ర్చిపోయిన‌ట్లు ఉంటుంది. నోట్ల ర‌ద్దు, జిఎస్‌టి వంటి విధానాల‌తో జాతీయ‌ వాణిజ్య రంగం కుదేలైతే ఆన్‌లైన్‌, డిజిట‌ల్ చైత‌న్యంతో అమెరికాకు చెందిన అమెజాన్‌, ప్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు లాభాలు భార‌త దేశంనుండి రెట్టింపు అయ్యాయంటే మోడీ చెప్పే దేశ‌భ‌క్తి, అభివృద్ది ఎవ్వరికోస‌మో ప్ర‌జ‌లే అర్ధం చేసుకోవాలి.