చీరాల : చీరాల ఇంజనీరింగ్ కాలేజీ (సిఇసి)లో గత రెండు రోజులుగా నిర్వహించిన టెక్నికల్ సింపోజియం సప్తవర్ణ 2018విజయవంతంగా ముగిసినట్లు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ తేళ్ల అశోక్‌కుమార్ తెలిపారు. విద్యార్ధులు టెక్నికల్, పేపర్ ప్రజెంటేషన్, క్రీడలు, క్విజ్, నృత్య, గాన, నాటికలు వంటి పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా తేళ్ల అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్ధులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జరిగే ఇంటర్వూలకు అందరూ హాజరై ఉద్యోగాలు పొందాలని సూచించారు. సిఆర్‌టి ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలుగు నవలా రచయిత యండమూరి వీరేంద్రనాద్ మాట్లాడుతూ ఇంటర్వూల్లో విజయం సాధించాలంటే జ్ఞపకశక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్ సురేష్‌బాబు, చింతపల్లి ప్రభాకర్, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ వై వేణుబాబు, ప్లేస్‌మెంట్ సెల్ అధ్యక్షులు వైటి సమీర్ పాల్గొన్నారు.