చీరాల : వారాంతంలో సేదతీరేందుకే హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమీషనర్ పి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బోస్‌నగర్‌లోని నీలం జేమ్స్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాంతం ఆటా పాటలతో ఉల్లాసంగా నిర్వహించారు. బెలూన్ బరస్టింగ్, మ్యూజికల్ ఛైర్స్, బౌలింగ్ వంటి ఆటలు నిర్వహించారు. ఆటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. గీతా సంస్థ సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్‌వి రమణ, గీతా సంస్థ ఎండి వలివేటి మురళీకృష్ణ, కోఆర్డినేటర్ జానీబాషా, పవని భానుచంద్రమూర్తి, ఐవి స్వామి, ఆట్ల సురేష్‌కుమార్, సాంబశివరావు, జయశ్రీ, గీత పాల్గొన్నారు.