చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వైభవ్ 2018 టెక్నికల్ సింపోజియం శుక్రవారం ప్రారంభించారు. ఆంద్రప్రదేశ్‌తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 100కళాశాలల నుండి 560మంది విద్యార్ధులు హాజరైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. చెన్నై ఆమ్‌టెక్స్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ మానవ వనరుల విభాగం నిర్వాహకులు, ఉపాధ్యక్షులు సత్యప్రకాష్ శేఖరన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోటీలకు వివిధ కళాశాలలకు చెందిన అనుభవజ్ఞలైన అధ్యాపకులు నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. వైభవ్ కన్వీనర్ డాక్టర్ పి హరిణి మాట్లాడుతూ ప్రతివిద్యార్ధి విజ్ఞానాభిలాష కలిగి ఉండాలన్నారు. సాంకేతిక, సాంస్కృతిక, సృజనాత్మక విభాగాల్లో ప్రతిభ కలిగి ఉండాలని చెప్పారు.
ఇలాంటి పోటీల్లో పాల్గొంటే విద్యార్ధులు తమ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవచ్చని ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ పేర్కొన్నారు. ఇతరుల అనుభవాలు తెలుసుకోవచ్చన్నారు. విద్యార్ధులు నైపుణ్యం అభివృద్ది చేసుకోవచ్చన్నారు. విద్యార్ధులు లక్ష్యాన్ని నిర్ణయించుకుని వాటి సాధనలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలన్నారు. సత్యప్రకాష్‌శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఇంజనీరింగ్ విద్యార్ధి తమ ఆలోచనాధోరణి సమాజాన్ని ఉన్నత స్థాయిలో ఉంచే రీతిలో ఉండాలన్నారు. పూర్వపు ఇంజనీర్లకు ఇప్పటి ఇంజనీర్లకు చాలా తేడా ఉందన్నారు. ఇప్పటి ఇంజనీర్లు తమ టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని శాశిస్తున్నారని చెప్పారు. టెక్నాలజీ దేశ రూపురేఖలను, ఆర్ధిక స్థితిగతులను ఉన్నత స్థాయిలో అభివృద్ది చెందటానికి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్పోర్ట్స్ ఉత్సవ్ 2018లో గెలుపొందిన వివిధ క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు. సభలో కళాశాల వైస్‌ఛైర్మన్ బి ఫణిరాజ్, పి సాంబశివరావు, కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్, డాక్టర్ సి సుబ్బారావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు, అడ్మినిష్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి, వైభవ్ కన్వీనర్ డాక్టర్ పి హరిణి, డాక్టర్ కె జగదీష్‌బాబు, వి లక్ష్మినారాయణ, ఎ పవన్‌కుమార్, డాక్టర్ ఎ పూర్ణచంద్రరావు, డాక్టర్ ఆర్ ఇమ్మానియేల్, డాక్టర్ సిహెచ్ కిషన్, డాక్టర్ కె విజయభాస్కరరెడ్డి, ఎస్ అమర్‌నాద్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.