Home ప్రకాశం టిడిపితోనే మ‌హిళా సాధికారిత సాధ్యం : దాసరి రాజా మాష్టారు

టిడిపితోనే మ‌హిళా సాధికారిత సాధ్యం : దాసరి రాజా మాష్టారు

355
0

కందుకూరు : మహిళలు తలచుకేంటే సాధించలేనిది ఏదీ లేదని, టిడిపి ఆవిర్భావం నుండి మహిళలకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యం కలిగిస్తోందని టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, టిడిపి శిక్ష‌ణా కేంద్రం డైరెక్ట‌ర్ దాస‌రి రాజా మాస్టారు పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్ మహిళా అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసారని పేర్కొన్నారు. మహిళలను తెలుగింటి ఆడపడుచులుగా సంబోదిస్తూ అన్న ఎన్టీఆర్ అక్కున చేర్చుకున్నారని చెప్పారు. నేడు చంద్రబాబునాయుడు మహిళా సాదికారత కోసం అనేక విన్నూత్న పధకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. మహిళా సాదికారత టిడిపితోనే సాధ్యమని అన్నారు. కందుకూరులోని తెలుగువిజయం ప్రాంగణంలో జరుగుతున్న టిడిపి 157వ‌ బాచ్ శిక్ష‌ణ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తొలుత‌ ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు, ప్రత్యేక‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సాధికారత కోసం కృషి చేస్తే, దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అని మహిళలకు 33.3% స్థానిక సంస్థల పదవులలో రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించడం, విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ ఏర్పాటు చేయడం, గిరిజన మహిళలలకు “గిరిపుత్రిక కళ్యాణం”, ముస్లిం మహిళలకు “దుల్హన్” పథకం ద్వార రూ.50వేల ఆర్ధిక సహాయం చేస్తున్నార‌ని చెప్పారు. మహిళా సంరక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక మహిళా డీయస్పీని నియమిచార‌ని చెప్పారు. ప్రతి ఇంటికి మహిళల పేరుతో “దీపం” పడకం ద్వారా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారని గుర్తుచేసారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో దేశంలోనే తొలిసారిగా 2017 ఫిబ్రవరిలో మూడు రోజులపాటు జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించడం ద్వార దేశ విదేశాల ద్రుష్టిని రాష్ట్రం వైపు మళ్లించార‌న్నారు. ఈ సదస్సులో దేశం నలుమూలల నుండి మహిళలు హాజరయ్యారని గుర్తు చేసారు. అన్న సంజీవని పడకం ద్వార జెనరిక్ మందుల‌ దుకాణాల బాధ్యతను డ్వాక్రా మహిళలకు అప్పగించామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రతినెల 40 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రతి మ‌హిళా ఆర్ధిక స్వావలంబన చెందేవిదంగా టిడిపి కృషి చేస్తుందని చెప్పారు. రాజకీయంగా మహిళకు ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చారన్నారు. ప్రతిబా భారతిని శాసనసభ స్పీకర్‌గా అవకాశం కల్పించార‌ని గుర్తు చేశారు. అదేవిధంగా నేటి బడ్జెట్లో డ్వాక్రా సంఘాలకు దాదాపు రూ.2700కోట్ల నిధులు కేటాయించార‌న్నారు. శిక్షణకు గుంటూరు జిల్లా నుండి వేమూరు, తెనాలి, వినుకొండ, గుంటూరు పశ్చిమ, ప్రకాశం జిల్లా నుండి కొండపి, దర్శి, మార్కాపురం, నెల్లూరు జిల్లా నుండి గూడూరు, సూళ్ళురుపేట నియోజక వర్గాల నుండి గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిభిరం సిబ్బంది కాకర్ల మల్లికార్జున్, పాపారావు పసుపులేటి, చైతన్య, పరమేశ్వర రెడ్డి చిట్టెం పాల్గొన్నారు.