– ప్రమాదంలో ప్రజాస్వామ్యం
– ఎన్నికల నిర్వహణపై అనుమానాలు
– సైంటిఫిక్ ట్యాంపరింగ్‌పై విచారణ జరిపించాలని కోరుతున్న ప్రజాసంఘాలు
– ఇవిఎంలపై విశ్వసనీయతను ఎన్నికల కమీషన్ చూపించుకోవాల్సిన పరిస్థితి
అమరావతి : గడిచిన నాలుగేళ్లలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసన ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఎన్నికల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి స్వీప్ చేయడంపై ఎన్నికల నిర్వహణలో సైంటిఫిక్ ట్యాంపరింగ్ (ఇవిఎం) పదం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని డిల్లీలో ఆప్ ప్రతినిధులు ఎన్నికల కమీషన్‌ను సైతం ఛాలెంజ్ చేశారు. ట్యాంపరింగ్ లేదని ఎన్నికల కమీషన్ నీరూపించుకోవాలని కోరారు. కానీ ఆప్ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమీషన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల ఫలితాలు బిజెపికే అనుకూలంగా ఏకపక్షంగా రావడంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకోకపోవడం, ఇవిఎంలలో వచ్చిన ఫలితాలనే ప్రమాణికంగా చేయడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా వేధికగా భిన్నమైన వాదనలు, చర్చలు చోటు చేసుకున్నాయి. అయితే వాస్తవం ఏమిటనేది ఎన్నికల కమీషన్ ఇలాంటి చర్చలకు ముగింపు ఇవ్వాల్సి ఉంది.
నోట్ల రద్దు. జిఎస్‌టి వంటి నిర్ణయాలతో సాధారణ ప్రజలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల్లో నగదు ఉండీ వాడుకోలేని దుస్థితి ఏర్పడింది. బ్యాంకులను కొల్లగొట్టిన కార్పోరేట్ తిమింగలాలన్నీ సురక్షితంగా దేశం వదిలి వెళ్లాయి. బ్యాంకులు దివాళాతీస్తే ఖాతాదారులు పొదుపు చేసుకున్న ఎఫ్‌డిలను దివాళా కొరతకు జమచేసుకుంటామని చేసిన ప్రకటనతో ఎఫ్‌డిలన్నీ రద్దు చేసుకుని బ్యాంకులనుండి నగదు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో నోట్ల రద్దు సమయంలో ఏర్పడ్డ నగదు కొరత వెంటాడుతూనే ఉంది. అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రకటనతో ప్రధాని ప్రపంచ దేశాలన్నీ తిరిగేందుకు సొమ్మును తగలేస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు తప్ప మిగిలిన రాష్ట్రాలకు కేంద్రంనుండి చెందాల్సిన నిధులు కూడా ఇవ్వడంలేదు. నిధులకోసం కేంద్రంపై ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ ఇళ్లు మీరు తుడుచుకోండంటూ స్వచ్ఛ భారత్ ప్రకటనలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదు. కానీ మోడీ ఏదో చేస్తున్నాడని, పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుని దేశభక్తి ఫోజులు ఇస్తూ ప్రజలను సున్నితమైన అంశాలపై రెచ్చగొడుతున్నారు. మద్యయుగాల నాటి పరిస్థితులు కల్పించేలా ఏది తినాలో, ఏ బట్ట కట్టుకోవాలో, ఏవి మాట్లాడాలో నిర్ణయిస్తూ వ్యక్తిగత స్వేచ్చను సైతం హరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బిజెపినే ఆదరిస్తున్నారని, ఎన్నికలు జరిగిన స్థానాలన్నీ స్వీప్ చేయడం అనుమానాలకు కారణమైన అంశాలు. వీటికితోడు ఇవిఎంలలో విశ్వసనీయత ఎంత? అనే అంశాలపై ఎన్నికల కమీషన్‌ను ఛాలెంజ్ చేసినప్పటికీ ఎలాంటి ప్రకటన ఎన్నికల కమీషన్ నుండి రాకపోవడం సోషల్ మీడియాలో ఎన్నికల ఫలితాలపై భిన్న వాదనలకు మూలమయ్యాయి.
త్రిపుర ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయి?
కమ్యూనిస్టుల కోట పగిలింది, విరిగింది, కూలింది వంటి మాటలతో మీడియా, సామాజిక మాధ్యమాలు, ఎల్ట్రానిక్ మీడియా, సంఘ్ పరివార్ శక్తులు ప్రచారం చేస్తున్నా తీరు చూస్తే ఇదంతా నిజమేననుకునే పరిస్థితులు కలుగుతున్నాయి. ఐతే అస్సలు కమ్యూనిస్టులు త్రిపురలో నిజంగానే బలహీన పడ్డారా? అంటే లేదని ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది.
త్రిపుర సామాజిక పొందిక, బాషలు ఏంటి?
బెంగాలి బాష మాట్లాడేవాళ్లు 67.14శాతం, త్రిపురి (కోక్‌బరోర్) బాష మాట్లాడేవాళ్లు 25.46శాతం, హిందీ మాట్లాడేవాళ్లు 1.68శాతం, కుకీ మాట్లాడేవాళ్లు 1.2శాతం, మోగ్ బాష మాట్లాడేవాళ్లు 0.9శాతం, ఇతర బాషలు మాట్లాడేవాళ్లు 3. 62శాతం మంది ఉన్నారు. 83.4శాతం హిందువులు, 8.6శాతం మంది ఇస్లాం, 4.35శాతం మంది క్రిస్టియన్, 3.41శాతం బౌద్దులు, 0.02శాతం మంది సిక్కులు, 0.02శాతం మంది జైనులు, 0.2శాతం మంది ఇతరులు ఉన్నట్లు 2011జనాభా లెక్కలు చెబుతున్నాయి.
కమ్యునిస్టుల రాజకీయ ప్రస్తానం ఏంటి?
మెదటి సారి కమ్యూనిస్టులు త్రిపురలో అధికారంలోకి వచ్చినప్పుడు 1979లో ఏకంగా 56 స్థానాలు కమ్యునిస్టులు గెలుచుకున్నారు. అప్పట్లో ఓట్ల శాతం 52.86 % వచ్చాయి. ఆతరువాత మరల 1993లో దశరద్‌దేబ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 49 .13 % శాతం ఓట్లతో 41మంది ఎంఎల్ఎలను కమ్యునిస్టులు గెలుచుకున్నారు. ఆతరువాత జరిగిన వరుస ఎన్నికల్లో వామపక్ష కూటమి వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. 1998లో 46.87% ఓట్లతో 39 మంది ఎంఎల్ఎలు, 2003లో 47.36% ఓట్లతో 46 మంది ఎంఎల్ఎలు, 2008లో 40.49% ఓట్లతో 47 ఎంఎల్ఎలు, 2013లో 49.68 ఓట్లతో 50 మంది ఎంఎల్ఎలను కమ్యునిస్టులు గెలుస్తూ వచ్చారు. 2018ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో 43. 61 % ఓట్లతో 17 ఎంఎల్ఎలను గెలుచుకుంది . అయితే మొత్తం మీద కమ్యూనిస్టులకు తగ్గిన ఓట్లు తీసుకుంటే కేవలం 6.07 శాతమే. ఇంక త్రిపురలో 1963 నుండి ఎన్నికలు జరిగితే మొత్తం మీద 55 సంవత్సరాలలో 40 సంవత్సరాలు ఆ రాష్టాన్ని కమ్యూనిస్టులే పరిపాలించారు. ఇలాంటప్పుడు కనీసం 6శాతం మందికి సహజంగానే వ్యతిరేకత ఉండవచ్చు కానీ ఇక్కడా జరిగిందేంటో పరిశీలించాలి.
బిజెపి గెలవటానికి కారణాలేంటి? మొత్తం మీద 40 సంవత్సారాలుగా కమ్యూనిస్టుల ప్రభుత్వమే అధికారం. అందులోనూ 35 సంవత్సరాలు ఏకధాటిగా కమ్యునిస్టు ప్రభుత్వం పాలించింది. 85 % హిందూ జనం. అందులోనూ మూడనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు ఒకవైపు, రెండున్నర సంవత్సారాలుగా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం మరోవైపు. మన సాంప్రదాయాలను కమ్యూనిస్టులు గౌరవించక పోగా, అవహేళన చేస్తున్నారని చేసిన విషప్రచారం ఒక ఎత్తు అయితే కాంగేస్ పార్టీ పై తీవ్ర వ్యతిరేకత, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేదన్న అపనమ్మకం, కేవలం టూరిజం మీదనే రాష్ట ఆదాయం ఆదారపడటం, కేంద్రం నుండి ప్రత్యేక హోదాతో పాటు పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేస్తామని సత్య ప్రచారకుడిగా దేశా ప్రధానే స్వయంగా ఆ ప్రజలు మోసపోయే విదంగా ప్రకటించటించారు. దీంతో పాటు బిజెపినే హిందూ మతానికి ఏకైక పార్టీ అని ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, శక్తులు ప్రచారం చెయ్యడం, కేంద్రంతో పాటు, చాలా రాష్తాల్లో బిజెపి అధికారంలో ఉండటం వళ్ళ నిధులు అధికంగా రావటంతో పాటు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని లోకల్ మీడియ పదే పదే ప్రచారం చేసింది. స్థానిక బాషలలో సోషల్ మీడియలో కమ్యూనిస్టులపై అసత్య ప్రచారాలు చేశారు. బిజెపి, హిందూత్వ అనుకూల ప్రచారం చేశారు. నిధులు లేక త్రిపురలో రోడ్లు సరిగా లేని కారణాలు అన్నీ బిజెపి గెలుపుకు కారణాలని ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఇదేనా?
2018తాజా ఎన్నికల ఫలితాలు. ఓట్ల శాతం వివరాలు ఇలా.
తాజాగా ఎన్నికల ఫలితాలలో ఓట్లు, సీట్లను పరిశీలించిన సోషల్ మీడియా వీక్షలు చేస్తున్న ఆరోపణలకు కారణమైంది. వామపక్ష కూటమిలో సిపియంకు 42.7శాతం, సీపీఐకి 0.8శాతం, ఆరెస్పీకి 0.8శాతం మొత్తం లెఫ్ట్ ఫ్రాంట్‌కు 44.3శాతం ఓట్లతో 16మంది ఎంఎల్ఎలకు పరిమితమైంది. కానీ బిజెపి 43శాతంతో 35మంది ఎంఎల్ఎలను గెలుచుకుంది. ఐపిఎఫ్‌టి 7.8శాతం ఓట్లతో 8మందిని గెలుసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధులు 1.5శాతం ఓట్లు పొందారు. లెఫ్ట్‌ప్రంట్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు కలిసి 52.3శాతం ఓట్లు సాధించారు. మెజార్టీ సీట్లు సాధించిన బిజెపికి, వామపక్ష కూటమికి మద్య తేడా 0.3శాతం మాత్రమే. ఇవే లెక్కలు ఇవిఎంలపై విశ్వసనీయత ఎంత? అనే ప్రశ్నకు కారణమయ్యాయి. భవిష్యత్తులో బ్యాలెట్‌తో ఎన్నికల కోసం, దామాషా ఎన్నికల విధానం కోసం ఉధ్యమం చేస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ.