చీరాల : జోహేన్స్ గుటెన్ బర్గ్ జయంతి సందర్బంగా పట్టణంలో ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
గుటెన్ బర్గ్ చిత్ర పటానికి పులమలలతో నివాళులర్పించారు. జోతిరావుపులే, ప్రగడ కోటయ్య, అంబెడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రింటర్స్ అండ్ బైన్డెర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ పివి ప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె సురేష్ మాట్లాడారు. డిజిటల్ యోగంలో కూడా ప్రింటింగ్కు ఉండే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అచ్చు యంత్రాన్ని కనుగున్న గుటెన్ బర్గ్ ప్రపంచ చరిత్రకు అక్షర రూపం ఇచ్చారని అన్నారు. ఆధునిక యుగంలో ప్రింటింగ్ అవసరాలు మారుతున్నాయన్నారు. మారుతున్న ఆధినికతకు అనుగుణంగా నూతన ప్రింటింగ్ యంత్రాలను అమార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాజు శ్రీనివాసరెడ్డి, గోవిందు రంగనాయకులు, మామిడిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.