Home ప్రకాశం రైల్యే స్టేషన్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

రైల్యే స్టేషన్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

396
0

చీరాల : రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ శుక్రవారం చీరాలలో నిర్వహించారు. సమావేశంలో చీరాల రైల్వే స్టేషన్ కు సంబంధించిన సమస్యలపై చర్చించారు. రైల్వే స్టేషన్ లో ఎల్లప్పుడు కూలీలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. రెండవ నంబర్ ప్లాట్ ఫామ్ మీద దోమలు రహిత క్యాబిన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ పడమర వైపు సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రి వేళలో మహిళా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించాలని కోరారు.

వాణిజ్యపరంగా చీరాలలో ఎక్కువమంది సుదూర ప్రాంతాలకు వెళ్లుతుంటారని, అలాంటి వాళ్ళు విజయవాడ లేక ఒంగోలు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తుందని చెప్పారు. కోరమండల్, సంగమిత్ర రైళ్లకు చీరాలలో హాల్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒకటవ ప్లాటుఫామ్ పైన ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే స్టేషన్ బయట పోలీసుల బందోబస్తు ఉంచాలని కోరారు. రైల్వేస్టేషన్ వెలుపల పోలీస్ ఔట్ స్టేషన్, పోలీస్ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు తెలియజేసారు.

కార్యక్రమంలో డిఆర్ యుసిసి సభ్యులు వై సత్యనారాయణ, కొల్ల సుబ్బారాయుడు, విజయవాడ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు, విజయవాడ డివిజన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ మూర్తి, విజయవాడ డివిజన్ ఓఎస్ కల్పారాజు, చీరాల రైల్వే స్టేషన్ మేనేజర్ ఎస్ ప్రసాద్, ఒంగోలు డివిజన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎం సాగర్, స్టేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్ సుమన్, చీరాల రైల్వే క్యాన్సిలటింగ్ కమిటీ సభ్యులు తాడివలస దేవరాజు, తలం సాయిబాబు, విజయ, మని, సౌభాగ్య లక్ష్మి, సుభాషిణి, ఎంవి సుబ్బారావు పాల్గొన్నారు.