విశాఖ : విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై వెయిటర్ కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్ వెళ్ళేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచాడు. అదేసమయంలో కోడిపందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే వెంటనే జగన్ సహాయకులు అడ్డుకోవడంతో జగన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లోని ఓ హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ వెళ్లారు. అయితే దాడి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.