Home ప్రకాశం అవగాహన సామర్ధ్యం ఉంటేనే…: న్యాయమూర్తి శ్రీనివాస్

అవగాహన సామర్ధ్యం ఉంటేనే…: న్యాయమూర్తి శ్రీనివాస్

315
0

చీరాల : విద్యార్థినులు చట్టలతోపాటు సామాజిక అంశాలను అవగాహన చేసుకోగల సామర్ధ్యం ఉంటే ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోగల ధైర్యం వస్తుందని సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ కృష్ణన్ కుట్టి, జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ శ్రీనివాస్ చెప్పారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా నారాయణ జూనియర్ కాలేజీలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బృణ హత్యలను నివారించి బాలికల శాతం పెంచేందుకు చేసిన చట్టాలను వివరించారు. బాలికల సంరక్షణతొనే ఆరోగ్యవంతమైన, అభివృద్ధి కారమైన సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయ వాదులు ఎ రామకృష్ణ, డి శ్రీనివాసరావు, ఏవి సుబ్బారెడ్డి, కె వాసుబాబు, బార్ అసోసియేషన్ సెక్రటరీ రమేష్ బాబు, కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.