Home ప్రకాశం జీఓ 279 రద్దు చేయాలని ధర్నా

జీఓ 279 రద్దు చేయాలని ధర్నా

400
0

ఒంగోలు : జీఒ నెం 279ని రద్దుచేయాలని, కనీస వేతనం రూ.18వేలు ఇవ్యాలని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మున్సిపల్ పారిశుద్య కార్మికుల సమ్మె 5వరోజుకు చేరుకుంది. ఒంగోలు నగరపాలక సంస్ధలో పరిశుద్య కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు సిపిఎం, సిపిఐ, జనసేన నాయకులు మద్దతు తెలిపారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మెకు మద్దతుగా వెన్నంటి ఉంటామాని తెలియజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లడుతూ రాష్ట్రవ్యప్తంగా పారిశుద్ద్య కార్మికులు న్యాయమైన డిమాండ్లతో సమ్మెచేస్తుంటే ప్రభుత్వం వారి సమస్యను పరిష్కంచకుండా వారి స్ధానంలో పోటీ కార్మికులను నియమించి విధులు నిర్వహించడం ఏమిటని ప్రశ్నంచారు. జనసేన జిల్లా కన్వీనర్ రావూరి బుజ్జి మాట్లాడుతూ ఒక దేశ సైనికునిలా పారిశుద్య కార్మికులు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి నగరాన్ని శుభ్రంగా ఉంచి ప్రజలను ఆనారోగ్యాల నుండి కాపాడుతున్న కార్మికుల సంక్షేమంపై నిర్లక్షవైకరిని ప్రభుత్వాలు ప్రదర్మించడం తగదన్నారు. కార్యక్రమంలో పలువురు వామపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.