ఒంగోలు : మహిళల అక్రమరవాణ, బాల్యవివాహాలు, బాలల హక్కులపై ఉన్న చట్టాలను ఎంపిక చేసిన పోలీసు అధికారులకు, ప్రభుత్వ నాయవాదులకు ఒక్కరోజు శిక్షణా తరగతులను ఆదివారం నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా కోర్టులో హెల్ప్ స్వచ్చంద సంస్ధ, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణలో ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్‌జె విశ్వనాధ్ మాట్లాడారు.
మంచి సమాజం కోసం కృషిచేయాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికార సంస్ధ కార్యదర్శి టి రాజా వెంకటాద్రి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ శరత్‌బాబు, హెల్ఫ్ ఎన్‌జిఒ సంస్ధ డైరెక్టర్ ఎన్‌విఎస్ రామ్మోహన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ శివరామ కృష్ణప్రసాద్, చైల్డ్‌లైన్ సాగర్, స్వచ్చంద సంస్ధల ప్రతినిదులు పాల్గొన్నారు.