Home క్రైమ్ భార్య చనిపోయిందన్న మనస్తాపంతో….

భార్య చనిపోయిందన్న మనస్తాపంతో….

750
0

సింగరాయకొండ : కనుమళ్ల మలినేని కళాశాల హస్టల్ సమీపం వ్యక్తి ఆత్మహత్యచేసుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. శానంపూడి గ్రామానికి చెందిన కె నాగరాజు(32) అనే వ్యక్తి తన కారులోనే కూర్చుని పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హెదరాబాదులో బిల్డర్గా పనిచేస్తున్న మృతుడు నాగరాజు భార్య రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె మృతదేహన్ని తమస్వస్దలమైన శానంపూడికి తీసుకు వచ్చారు. అంత్యక్రియలు పూర్తిచేశారు. బార్య మరణాన్ని తట్టుకోలేక మనస్దాపానికి గురై నాగరాజు తన ఇద్దరు పిల్లలను కారులో ఎక్కించుకుని ఇంటినుండి వెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడో తెలియక కుటుంభ సభ్యులు వేడుకుంటున్నారు. అదే సమయంలో మలినేని కాలేజీ వద్ద పిల్లల ఏడ్పులు విన్న కాలేజీ విద్యార్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.