ఉలవపాడు : బైకులు చోరీ కేసులో ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీసులు నెల్లూరు జిల్లా దగదర్తికి చెందిన ఖాదర్ భాషను రెండురోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ముద్దాయి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. పోలీస్ విచారణలో పూర్తి వివరాలు వెళ్ళండి కావాల్సి ఉంది.