చీరాల : పరిశుభ్రత, స్వచ్ఛ సర్వేక్షన్ వంటి సామాజిక ప్రయోజనకర పరిశుభ్ర పథకాల అమలుకు మహాత్మా గాంధీ చెప్పిన సందేశాలు ఆదర్శంగా తీసుకుని అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాలీ, సభలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరు సమిష్టిగా చేసిన కృషి ఫలితమేనని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని పొందడం అభినందనీయమన్నారు. అదే పారిశుధ్య పనిపెద్దతులను కొనసాగించాలని చెప్పారు. అనంతరం యువనేస్తం పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.
యువనేస్తం పత్రాలు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన యువనేస్తం పథకంలో అర్హులైన లబ్ధిదారులకు చేతివృత్తుల కార్పొరేషన్ డైరెక్టర్ గొడుగుల గంగరాజు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు ఉపాధి చూపేలక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సభలో ఎఎంసి ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మునిసిపల్ ఛైర్మన్ మొదడుగు రమేష్ బాబు, కమిషనర్ షేక్ ఫజులుల్లా, కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ, డిఇ గణపతి, టిపిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.