చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్ధులకు డిస్‌మాండ్డింగ్ అండ్ అసెంబ్లింగ్ ఆఫ్ ఐసి ఇంజిన్స్‌పై మూడు రోజుల వర్క్‌షాపు ప్రారంభించినట్లు కళాశాల కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. మూడు రోజుల వర్క్‌షాపులో అనంతపురం జెఎన్‌టియు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ డాక్టర్ బి దుర్గాప్రసాద్, విశాఖపట్టణం విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి హరిశంకర్ విద్యార్ధులకు అనేక విషయాలు వివరిస్తారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. ఆధునిక ఆటోమొబైల్స్ రంగంలో ఐసి ఇంజన్స్ ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయన్నారు. ఇలాంటి వర్క్‌షాపుల వల్ల ఆధునిక సాంకేతికత తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, హెచ్ఒడి వి లక్ష్మినారాయణ పాల్గొన్నారు.