శ్రీకాళహస్తి : జంగమ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఈనెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్థానిక వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రవాణా శాఖా మాత్యులు కింజారపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కె రామ్మోహన్నాయుడు, ఎంఎల్ఎ గుంజ లక్ష్మిదేవి, ఎంబిసి ఛైర్మన్ కాకి గోవిందరెడ్డి హాజరవుతారని సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి శివశంకరరాజు తెలిపారు.
రాష్ట్ర జంగమ సంక్షేమ సంఘం అధ్యక్షులు విశాఖపట్నంకు చెందిన పూతి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రాజమండ్రికి చెందిన మంత్రి మూర్తిరాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకనాధం ఆనందరావు ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా నుండి కోశాధికారిగా దోగుపర్తి సుబ్బారావు, సహాయ కార్యదర్శి పావళ్ల శివరప్రసాదు (చీరాల) ఎన్నిక కావడంపట్ల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.