గువాహటి : ఒడిస్సా పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సినీనటి ప్రియాంక చోప్పా చిత్రాలు ఆ రాష్ట్ర శాసన సభను కుదిపేశాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రియాంక హాట్ చిత్రాలతో రాష్ట్ర ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేసింది. టూరిజం క్యాలెండర్ కోసం చేసిన ఫోటో షూట్‌లో ఆమె హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది.
క్లీవేజ్ షోతో ఉన్న ఆమె ఫోటోలు రాష్ట్రవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. దీనిపై శాసన సభలో కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది. ‘అది (ఆమె ధరించిన గౌన్) అస్సామీ సంప్రదాయానికి వ్యతిరేకం. ఆదాయం కోసం ప్రభుత్వం మరీ ఇంత దిగజారాలా? నటీమణులు పద్ధతైన దుస్తుల్లో కనిపించాలే తప్ప. ఇలా అర్ధనగ్న ప్రదర్శనలకు దిగటం ఏంటి?` అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నందితా దాస్, రుప్‌జ్యోతి కుర్మిలు అసెంబ్లీలో చర్చ లేవనెత్తారు. ప్రియాంకను అంబాసిడర్ నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
అస్సాం పర్యాటక శాఖా మంత్రి హిమంత బిస్వా మాట్లాడుతూ ‘కాంగ్రెస్ చీప్ పబ్లిసిటీకి పాల్పడుతోంది. అసలు ఆ ఫోటోల్లో అసభ్యత ఎక్కుడుందో తెలీటం లేదు. ఏదైనా సంప్రదాయక వేడుకలు జరిగినప్పుడు ధోవతి, చీరలు అంటూ అంతే పద్ధతితో కనిపించాలి. కానీ, ఇది పర్యాటక శాఖకు సంబంధించిన అంశం. విదేశీయులు కూడా వస్తుంటారు. అలాంటి వారికి ఆహ్వానం ఆకర్షణీయంగా ఉండాలి. చీరల్లో పిలిస్తే పర్యాటకులు ఎవరూ రారు. అయినా అస్సామీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్ని రకాల దుస్తులు ధరిస్తుంటారన్న విషయం విమర్శలు చేసేవారికి కూడా తెలిసే ఉంటుంది’ అంటూ ప్రియాంకను వెనుకేసుకుని వచ్చారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
బెర్లిన్ నగరంలో ప్రియాంక ప్రధాని మోదీని కలిసిన సమయంలో అసభ్యకరమైన దుస్తులు, కాలి మీద కాలేసుకుని కూర్చోని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పట్లో ఆమెపై విమర్శలు వినిపించాయి.