చీరాల : చదువుతోపాటు విద్యార్ధులు కమ్యునికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య పేర్కొన్నారు. కళాశాల ఆడిటోరియంలో సోమవారం జరిగిన ఫ్రెషర్స్‌డే వేడుకల్లో ఆయన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. నైతిక విలువలు కలిగి ఉండాలన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. కాలం విలువైనదని సూచించారు. చదువుకునే వయస్సులో కాలం వృధా చేసుకుంటే తిరిగి రాదని చెప్పారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. అనంతరం విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో స్టాఫ్ రిప్రజెంటేటివ్ టి సాంబశివరావు, స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు వై సుబ్బారాయుడు, టి పోలయ్య పాల్గొన్నారు.