Home ప్రకాశం కొండ‌పిలో ఎల్ఎల్ఆర్ మేళా…

కొండ‌పిలో ఎల్ఎల్ఆర్ మేళా…

844
0

కొండపి : కొండ‌పిలో ఎల్ఎల్ఆర్ మేళా శుక్ర‌వారం నిర్వ‌హించారు. మోటారు వాహ‌న త‌నిఖీ అధికారి, పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన మేళాకు వాహ‌న చోద‌కులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఎల్ఎల్ఆర్ మేళాల‌లో 7వేల మందికి ఎల్ఎల్ఆర్‌లు ఇచ్చిన‌ట్లు తెలిపారు. మీ ముంగిటికే ర‌వాణా శాఖ కార్య‌క్ర‌మంలో భాగంగా మేళాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు మోటారు వాహ‌న త‌నిఖీ అధికారి ఆర్‌ సుందరరావు, స‌హాయ అధికారి కె విగ్నేశ్వరరావు పేర్కొన్నారు. వాహ‌న దారులు ప్ర‌తిఒక్క‌రు బాధ్యతగల పౌరుడిగా ఉండాలని కోరారు. ఈ మేళాలో ఇప్పటికీ 300 ఎల్ఎల్ఆర్‌లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండేపి ఎస్ఐ చంద్రశేఖర్, సిఎస్సి జిల్లా మేనేజర్ ఎన్‌ ప్రమోదుకుమార్ పాల్గొన్నారు.