– అధికారపార్టీ విధానాలను పరోక్ష సహకారం
– చట్టసభల్లో ప్రశ్నియించకుండా ప్రజాక్షేమం ఎలా?
– కార్పొరేట్ కొమ్ము కాస్తున్న వైసిపి
– శాసన సభను వదిలేసి ఎవరికి మేలుచేస్తున్నారు
అమరావతి : “చెరువు మీద అలిగి వెనుకటి ఎవరో ఎండబెట్టుకున్నాడట” ఈ సామెత తాజా రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి బాగా వర్తిస్తుంది. ప్రజాలకేదో జగన్ ఒరగబెడతారని ఓట్లేసి 65మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించి శాసన సభకు పంపారు. అధికారానికి చేరువగా వెళ్లారు. కానీ చట్టసభల్లో కనీస ప్రతిపక్ష పరకూడా పోషించకుండా శాసన సభను వదిలేశారు. అధినేత ఒక్కడు వదిలేశాడనుకుంటే ఏదో రాజకీయ పంతానికెళ్లాడనుకోవచ్చు. కానీ మూకుమ్మడిగా వైసిపి ఎమ్మెల్యేలు అందరూ శాసన సభ బహిష్కరిచారంటే ఆపార్టీకి ప్రజాతిపరుపై ఏమైనా బాధ్యత ఉందా?
ప్రజాజీవితాలను ప్రభావితం చేసే చట్టాలు పురుడుపోసుకునేది చట్టసభలోనేకదా. అలాంటి సభలో ప్రజాప్రయోజనాలపై చర్చించకుండా వదిలేస్తే అధికార పార్టీ ఏకపక్షంగా చేసుకునే తీర్మానాలు ఎవరికి ప్రయోజనం. ఎలాంటి చర్చ లేకుండా కోట్ల విలువైన ప్రజాధనం టెండర్లు, రాయితీల పేరుతో కాజేస్తుంటే మాట్లాడకుండా నేను అధికారానికి వస్తే కాలు కిందపెట్టకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి.
దేశాచరిత్రలో శాసన సభలో రెండే రెండు పార్టీలు ప్రాతినిధ్యం పొంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పూర్తిగా శాసన సభ వదిలేసి అధికార పార్టీకే పాలన మొత్తం అప్పగించిన నిస్సహాయ ప్రతిపక్షం వైసిపిని అయి ఉంటుంది. ఇంత నిస్సహాయంగా ఉంటే ఆపార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడంతో తప్పేమిటి.
ఒకవైపు రాష్ట్రంలో 1.50లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు దశాలవారి ఆందోళన చేస్తున్నారు. వెలుగొండ, పోలవరం వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని జనం రోడ్డెక్కుతున్నారు. ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం వంటి వినుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు శాసన సభలో ప్రతిపక్ష పార్టీలు వత్తిడి పెడితే కొంతైనా మేలుజరుగుతుంది.
i
పార్లమెంటులో ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామిపై మాట్లాడాల్సిన ఎంపిలను రాజీనామా చేయించారు. అదీ జాతీయ స్థాయిలో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఎన్నికల అయ్యాక పార్లమెంటు నుంచి బయటికొచ్చి ఏమి సాధించారు. హోదాపై చర్చించి మోడీని ఇరకాటంలో పెట్టె అవకాశాన్ని వదులుకుని అప్పనంగా కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో చంద్రబాబుకు పాలనా సౌలభ్యం కల్పించడం తప్ప. వైసిపి, టిడిపి తప్ప మరోపార్టీకి శాసన సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజా దురదృష్టం.