Home జాతీయం ఆ అమ్మ పెట్టదు… ఇంకో ఇంటికి వెళ్ళనివ్వదు…

ఆ అమ్మ పెట్టదు… ఇంకో ఇంటికి వెళ్ళనివ్వదు…

368
0

– కేరళకు కేంద్రం ఇచ్చింది రూ.600కోట్లు…
– అరబ్ దేశం ఇస్తానన్నది రూ.700 కోట్ల సాయం…
– బిజెపి, మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం విదేశిసాయం నిరాకరిస్తుంది.
– కేరళ ప్రజలు గరంగరం 

అమరావతి : అమ్మ పెట్టదు. ఇంకో ఇంటికి వెళ్ళనివ్వదు. అన్న సామెత మోడీ నాయకత్వలోని కేంద్ర ప్రభుత్వ తీరుకు వర్తిస్తుంది. వరదలతో సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న కేరళకు ఆదుకోకపోగా సమయం చేసేవారినుంది కేరళ తీసుకోవడానికి అనుమతించేది లేదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. విదేశీ ‘వరద సాయం’పై వివాదం ముదురుతుంది. ప్రకృతి విలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు మానవత్వంతో స్పందిస్తూ పలు దేశాలు ముందుకొచ్చాయి. యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రూ.700 కోట్ల విరాళం ప్రకటించింది. ఖతార్‌ రూ.35 కోట్లు, మాల్దీవులు రూ.35లక్షల సాయం ప్రకటించాయి. అయితే విదేశాలు ప్రకటిస్తున్న ఈ సాయాన్ని కేరళ తీసుకునేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదించేందుకు నిరాకరించింది. విదేశీవ్యవహారాల అధికారి ప్రకటన చేశారు. దీనిపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. వరదలతో జనజీవనం అతలా కుతలమైనది. ఘోరంగా నష్టపోయింది. సహాయ, పునరావాస కార్యక్రమాలకు రూ.2600 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రధాని మోదీ వరద ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల సాయం ప్రకటించింది. జాతీయ విపత్తుగా ప్రకటించాల్సి విపత్తుకు కేంద్రప్రభుత్వ తీరుపై కేరళ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ సాయం కూడా అందకుండా అడ్డుచెప్పటం సరికాదని కేరళ ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ సాయాన్ని స్వీకరించేందుకు విధానపరంగా అవరోధాలేం లేవని కేరళ సీఎం పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో విపక్ష కాంగ్రెస్‌ కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

స్వీకరించటానికి సమస్యేమిటి?
కేంద్రం యూఏఈ ప్రకటించిన భూరి విరాళాన్ని అధికారికంగా తిరస్కరించింది. విదేశాల నుంచి నగదు సహాయాన్ని తీసుకోవటానికి సుముఖంగా లేమని దౌత్య వర్గాల ద్వారా అనధికారికంగానే విదేశాలకు తెలియజేస్తున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వం ఈపాటికే తమ ప్రభుత్వానికి చెప్పిందని భారత్‌లోని థాయ్‌లండ్‌ రాయబారి శామ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. గతంలో కూడా భారత్‌ విదేశీ నగదు విరాళాలను తీసుకున్న దాఖలాలు లేవని సౌదీ అరేబియాలో పని చేసిన మాజీ భారత రాయబారి ఒమన్‌ పేర్కొన్నారు. సాధారణంగా విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల నుంచే నగదు విరాళాలు తీసుకుని వాటిని అక్కడి రాయబార కార్యాలయాల ద్వారా ‘ఆర్‌బీఐ డ్రాఫ్ట్‌’ రూపంలో భారత్‌కు పంపుతాయి. ‘‘విపత్కాలంలో సహాయంగా అత్యవసర సరుకులు పంపటం చూశాం. నగదు విరాళాలు మాత్రం ఎప్పుడూ తీసుకోలేదు’’ అని ఒమన్‌ అన్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందిన భారత్ విదేశిసాయం పొందేందుకు సిద్ధంగా లేదని దౌత్యవేత్తలు చెబుతున్నారు. సునామీ సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విదేశీ సాయాన్ని సున్నితంగా ‘‘ప్రస్తుత ఉత్పాతాన్ని మాకు మేముగా తట్టుకోగలమనే అనుకుంటున్నాం. అవసరమైతే సాయం తప్పక తీసుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు.

నగదుకు నో!
2013 ఉత్తరాఖండ్‌, 2014 కశ్మీర్‌ వరదలప్పుడు కూడా విదేశీ నగదు విరాళాలను కేంద్రం ఆమోదించలేదు. అప్పట్లో రష్యా, అమెరికా, జపాన్‌ సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు వార్తలొచ్చాయి.
– ఒకరి నుంచి తీసుకుంటే ఆ వెంటే ఇతరులూ ప్రకటిస్తారు. దౌత్యపరంగా వాటిని వద్దనటం కష్టమని అప్పట్లో కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం.
– 2001 భుజ్‌ భూకంప విలయం తర్వాత సౌదీ అరేబియా మూడు విమానాల నిండుగా సహాయ సామగ్రి పంపినప్పుడూ నగదు స్వీకరించలేదు.

తీసుకుంటే తప్పేంటి?
– యూఏఈలో పనిచేస్తున్న, ఉంటున్న భారతీయులు 30 లక్షల మందిలో 80% మంది కేరళీయులే.
– మొత్తం గల్ఫ్‌ దేశాల్లో ఉన్న 80 లక్షల మంది భారతీయుల్లో 35 లక్షల మంది కేరళవాసులు.
– కేరళ వాసులు యూఏఈని తమ రెండో స్వదేశంగా భావిస్తారు. యూఏఈ నిర్మాణంలో కేరళీయుల పాత్ర ఎక్కువ. అలాంటి దేశం నుంచి సాయం ఎందుకు తీసుకోకూడదని కేరళ ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రశ్నిస్తున్నాయి.

మేం రూ.2,600 కోట్ల సాయం అడిగీతే కేంద్రం కేవలం రూ.600 కోట్లు! ఇప్పుడు మరో ప్రభుత్వం సాయం చేస్తానంటే వద్దనాల్సిన అవసరం ఏమిటో మాకేం అర్థం కావటం లేదు. కేంద్రం తీరు చూస్తుంటే బాధేస్తుంది. – కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌

‘‘నిబంధనలన్నవి ప్రజల కన్నీళ్లు తుడిచేవిగా ఉండాలి. విదేశీ సాయం స్వీకరించే విషయంలో విధాన పరమైన అవరోధాలు ఏమైనా ఉంటే వాటిని సవరించండి’’ – ఒమన్‌ చాందీ, కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర మాజీ సీఎం

‘‘దేశాలు పరస్పరం సహాయం చేసుకోవటం సహజం. 2016లో ప్రకటించిన విపత్తు నిర్వహణ విధానంలోనూ విదేశీ ప్రభుత్వమేదైనా సంఘీభావంతో సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తే కేంద్రం దాన్ని స్వీకరించొచ్చని స్పష్టం చేస్తోంది. అవసరమైతే దీనిపై ప్రధానినీ సంప్రదిస్తాం’’ – పినరయి విజయన్‌, కేరళ సీఎం