బాపట్ల : ప్రకృతి ప్రకోపానికి బలైన కేరళను ఆదుకునేందుకు భూరీ విరాళం ప్రకటించారు. ఎంఎల్‌సి, బాపట్ల టిడిపి ఇన్చార్జి అన్నం సతీష్‌ప్రభాకర్ కేరళ ప్రజలను ఆదుకునేందుకు తనవంతుగా రూ.5లక్షల భూరీ విరాళాన్ని జిల్లా కలెక్టర్ శశిధర్‌కు అందజేశారు. నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు దాతలు మానవతా దృక్పధంతో ముందుకు రావాలని కోరారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు రాజకీయాలతో పనిలేదని సూచించారు.
సిపిఎం తూర్పు ప్రకాశం విరాళం
ఒంగోలు : సిపిఎం తూర్పు ప్రకాశం జిల్లా కమిటి రూ.2.45లక్షల విరాళాన్ని ప్రజలు, పార్టీ సభ్యులనుండి సేకరించారు. సేకరించిన విరాళాలలను సిపిఎం ఆంద్రప్రదేశ్ కమిటి ద్వారా కేరళ ప్రభుత్వానికి పంపనున్నట్లు సిపిఎం తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు తెలిపారు.