చీరాల : రానున్న ఎన్నికల్లో పార్టీని విజయపధంలో నడిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని వైఎస్ఆర్‌సిపి పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా నూతనంగా పార్టీ సంస్థాగత పదవులు పొందిన కార్యకర్తలను పరిచయం చేశారు. ఎస్‌సి సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మద్దు ప్రకాశరావు, ఎస్‌సి సెల్ రాష్ట్ర సెక్రటరీ కన్నెగంటి శాసన్‌బాబు, చేనేత విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుత్తి వీరచంద్రప్రసాదు, రైతు సంఘం రాష్ట్ర సెక్రటరీ మద్దిబోయిన ఆదిశేషు, బాపట్ల పార్లమెంటు సేవాదళ్ అధ్యక్షులు అన్నంరాజు సుబ్బారావును ఆయన పరిచయం చేశారు.