Home వైద్యం గొంతు నొప్పి – ప‌రిష్కార మార్గాలు : శ్రీ‌కామాక్షి కేర్ హాస్పిట‌ల్ ఇఎన్‌టి డాక్ట‌ర్ ప‌లుకూరి...

గొంతు నొప్పి – ప‌రిష్కార మార్గాలు : శ్రీ‌కామాక్షి కేర్ హాస్పిట‌ల్ ఇఎన్‌టి డాక్ట‌ర్ ప‌లుకూరి సురేష్‌

979
0

పిల్లల్లో అతిసాధార‌ణంగా క‌లిగిచే బాధ‌ గొంతు నొప్పి. దీంతో పాటు ముక్కు, చెవులు, సైనసులు కూడా బాధ‌పెట్ట‌వచ్చు. ఈ జ‌బ్బుల‌న్నీ ఒక‌దానికొక‌టి అనుసంధానంగా ఉంటాయి. టాన్సిల్స్ గొంతులో ఉంటాయి కాబ‌ట్టి ఈ బాధలకు అవీ ప్రభావితమవుతుంటాయి. ఏడాదిలోపు పిల్లల్లో టాన్సిల్స్‌ చిన్నవిగా ఉన్నందున ఈ బాధలకు గురికాకపోవచ్చు. 4-8 సంవత్సరాల మధ్య వయసున్న‌ పిల్లల్లో ఈ బాధలు ఎక్కువగా ఉంటుంది. కొందరికి చెవిపోటు, కడుపునొప్పి కూడా కన్పించవచ్చు. ఇత‌ర‌ బాధలు పెరిగి గొంతునొప్పి మరుగునపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలున్న పిల్లల్లో గొంతును కూడా పరీక్షించటం అవసరం.

‘సోర్‌ త్రోట్‌’ విషయంలో నూటికి 80 కేసుల్లో వైరస్‌లు కారణం. మిగిలిన 20 కేసుల్లో బ్యాక్టీరియా క్రిములు కారణం. వీటి కారణంగానే కీళ్లవాపుతో కూడిన జ్వరం (రుమాటిక్‌ ఫీవర్‌), కిడ్నీ వాపు (గ్లోమరూలో నెఫ్రైటిస్‌) వంటి తీవ్ర సమస్యలూ రావ‌చ్చు. ‘స్కార్లెట్‌ ఫీవర్‌స‌కూ కార‌ణం కావ‌చ్చు.

వైర‌స్ లేక బ్యాక్టీరియా దేనివ‌ల్ల నొప్పి వ‌చ్చింద‌నేది గుర్తించ‌డం సాధ్యం కాని అంశం. దేనివల్లనైనా జ్వరం, నీరసం, ఆకలి మందగించటం, దగ్గు, మాట బొంగురుపోవటం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియా వ‌ల్లైతే త్వరగా గొంతు నొప్పి వ‌స్తుంది. పరీక్షలు జరిపి ‘బీటా హెమోలిటికస్‌ స్ట్రెప్టోకాకస్‌’ క్రిమిని గుర్తించటం జరిగింది. ఐనా వీటివ‌ల్ల‌నే గొంతునొప్పి వచ్చిందని చెప్పలేం. రోగులలో క్రిములకన్నా వారి రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ప్రధానమైన అంశమన్నది గుర్తించాలి. ఆరోగ్య వంతులైన‌ పిల్లల్లో కూడా నూటికి 10-20 మందిలో బీటా హెమోలిటికస్‌ క్రిములు కనిపిస్తాయి.

ఈ జ‌బ్బుకు యాంటీబయాటిక్‌ ఔషధాల వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు. చెవిలో చీము, మెడలో గ్రంథులు వాయటం, సైనసైటిస్‌, కీళ్ల వ్యాధులు, కిడ్నీల వాపు మొదలైన బాధలు వీరికి చోటుచేసుకుంటాయి. చ‌లికాలంలో ఎక్కువ‌మంది గొంతునొప్పితో ఇబ్బంది ప‌డుతుంటారు. వాతావరణంలో వ‌చ్చే మార్పులతో గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడతాయి. వీటివల్ల‌ గొంతునొప్పి (త్రోట్ పెయిన్) వ‌స్తుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడం, ఉపన్యాసాలు ఎక్కువగా ఇవ్వడం, విరామం లేకుండా పాటలు పాడటం వలన కొందరిలో గొంతు నొప్పి వ‌స్తుంది. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్, లెరింజైటిస్, ఫెరింజైటీస్ వంటి వ్యాధుల వలన కూడా గొంతు నొప్పి రావొచ్చు.

గొంతు నొప్పి లక్షణాలు :
నీరు త్రాగటం, ఆహారం మింగటం, గాలి పీల్చటం, మాట్లాడలేక‌పోవ‌డం, నోరు బొంగురుపోవటం, గొంతు తడారిపోవటం, నోటి దుర్వాసన, గొంతు నొప్పి, చెవినొప్పి జలుబుతో జ్వరం రావటం నీరసం, చికాకు వంటి లక్షణాలుంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
చల్లటిగాలిలో తిరుగకూడదు. కలుషిత నీటిని కాకుండా కాచి వడపోసిన నీటిని తాగ‌డం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకోవ‌చ్చు. చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, బేకరీ ఫుడ్స్ తీసుకోకూడదు. వ్యాధి తీవ్రంగా ఉంటే చన్నీళ్ల స్నానం కూడా చేయకూడదు. వ్యాధి తీవ్రత ఎక్కువ‌గా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలి.

చికిత్స విధానం :
జ్వరానికి : పరాసిటమాల్ మాత్రలు 500 మి.గ్రా. రోజుకి 2 లేదా 3 మాత్రలు చొప్పున్న 3-5 రోజులు ,
ఇంఫెక్షన్‌ తగ్గడానికి : ఎరిత్రోమైసిన్‌ 250 మి.గ్రా. రోజుకి 3 సార్లు 3-5 రోజులు ,
ఎక్కువగా మినరల్ వాటర్ త్రాగాలి, బిటాడిన్‌ మౌత్ వాస్ ద్రావకంతో గొంతు పుక్కలించాలి. సుల‌భంగా అరుగుద‌ల ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాలి, ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి .