Home ప్రకాశం మాన‌వ అక్ర‌మ ర‌వాణాపై అవ‌గాహ‌న స‌ద‌స్సు

మాన‌వ అక్ర‌మ ర‌వాణాపై అవ‌గాహ‌న స‌ద‌స్సు

727
0

చీరాల : మాన‌వ అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినం సంద‌ర్భంగా చీరాల వైఎ ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళ‌వారం మ‌హిళా సాధికారితా విభాగం ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. స‌ద‌స్సుకు ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సిహెచ్ ర‌మ‌ణ‌మ్మ అధ్య‌క్ష‌త వ‌హించారు. విద్యావంతులు కావ‌డం ద్వారా అక్ర‌మ ర‌వాణాకు గురికాకుండా ఉండ‌వ‌చ్చ‌ని చెప్పారు. ప్ర‌లోభాల‌కు లోనుకాకుండా మ‌హిళ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. మ‌హిళా విభాగం క‌న్వీన‌ర్ ధాత్రికుమారి, శ్రావ‌ణి మాట్లాడుతూ అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్ట‌డంలో ప్ర‌జ‌లు అంద‌రూ త‌మ బాధ్య‌త‌గా జాగృతం చేయాల‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో విద్యార్ధినులు, అధ్యాప‌కులు పాల్గొన్నారు.