Home ప్రకాశం పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకే…

పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకే…

505
0

చీరాల: పిల్లలలో పుస్తక పఠన అలవాటును పెంపొందించుటకు పౌర గ్రంథాలయాల శాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవులలో రాష్ట్రము లోని అన్ని ప్రభుత్వ గ్రంధాలయములయందు వేసవి శిబిరములు నిర్వహిస్తున్నట్లు గ్రంథ పాలకులు కె చిన్నపరెడ్డి తెలిపారు. బుధవారం శిభిరం ప్రారంభించారు. నేటి నుండి జూన్ 7వరకు ప్రతి రోజు ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించెదరని తెలిపారు. బాలల సమగ్రాభివృద్ధికి ఉపకరించే వివిధ పుస్తకాలను చదివించటం, చదివిన పుస్తకాలపై సమీక్షలు వ్రాయించడం, కథలు చెప్పటం, కధలు వ్రాయించటం, చిత్ర లేఖనం, సంగీతం, నాటికలు, ఆంగ్లములో సంబాషించుట మొదలైన అంశాలలో ఈ శిబిరాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి వారాంతములో పిల్లల శిక్షనను సమీక్షించడంతో పాటు శిక్షణ పూర్తి అయిన అనంతరం వివిధ అంశాలలో పోటీలను నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు, యోగ్యతా పత్రములు ఇవ్వనున్నట్లు తెలిపారు.

వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యము, ఆసక్తి కలవారు తమ అమూల్యమైన సమయాన్ని శిక్షణ ఇచ్చుటకు కేటాయిల్సిందింగా కోరారు. శిక్షణ నిర్వహణకు దాతలలు సహకరించాలని కోరారు. గ్రంధాలయ కార్యక్రమాల పట్ల అభిరుచి ఉన్న వారు, కవులు, రచయితలు, విశ్రాంత ఉద్యోగులు ప్రతి రోజు ఒక గంట సమయాన్ని పిల్లల అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు. ఆసక్తి గలవారు సంప్రదించాలని కోరారు.  కార్యక్రమంలో ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తి, జయరావు, అనిల్, పీవీ సాయిబాబు, రవికుమార్ పాల్గొన్నారు.