చీరాల : వేసవి తీవ్రత పెరుగుతుంది. మరో నాలుగు రోజులు 44డిగ్రీల వరకు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దారు ఎం వెంకటేశ్వర్లు సూచించారు. ఎండ సమయాల్లో బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పారు. పట్టణం, రూరల్ గ్రామాల్లోని చౌక దుకాణాల ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పట్టణానికి 250, రూరల్ గ్రామాలకు 150ఒఆర్ఎస్ పాకెట్లను రేషన్ డీలర్ల అసోసియేషన్ సభ్యుల ద్వారా పంపినట్లు తెలిపారు. చలివేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని తెలిపారు.