Actress Tabu : మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కొన్ని కలలు, కోరికలు, ఆశలు, అలవాట్లు ఉంటాయి. మనిషిని బట్టి ఇవి మారుతుంటాయి. అయితే కొందరి ఆలోచనలు, పద్ధతులు మాత్రం విచిత్రంగా ఉంటాయి. సెలబ్రెటీలు కూడా ఇందుకు అతీతం కాదు. వారికున్న క్రేజ్ దృష్ట్యా వారి అలవాట్ల గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అలనాటి ఒక స్టార్ హీరోయిన్‌కు విచిత్రమైన అలవాటుంది. దాని గురించి బయటకు రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
90వ దశకంలో టాలీవుడ్, బాలీవుడ్‌లను ఒక ఊపు ఊపారు టబు. వైట్ స్కిన్ టోన్, మత్తెక్కించే కళ్లు, ఆకట్టుకునే రూపంతో అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేశారు టబు. టాలీవుడ్‌తో తన కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా హాలీవుడ్‌లోనూ నటించింది. హైదరాబాద్‌కు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి టబు. ఆమె అసలు పేరు తబుస్సమ్ హష్మీ. బాలీవుడ్ దిగ్గజ నటి షబానా అజ్మీకి టబు స్వయానా మేనకోడలు. టబు చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. సినిమాలపై ఆసక్తితో చిన్నప్పుడే ముంబై చేరుకుని అవకాశాల కోసం ప్రయత్నించారు.
తొలుత బజార్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఆమె .. అనంతరం హమ్ నే జవాన్‌లో నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ 1తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 1991లో వచ్చిన ఈ సినిమాలో తన అందాలతో ఓవర్‌నైట్ స్టార్‌గా నిలిచింది టబు. తర్వాత సిసింద్రీలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. నిన్నేపెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, షాక్, ఇది సంగతీ, పాండురంగడు వంటి తెలుగు చిత్రాల్లో నటించారు.
దాదాపు 16 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల బ్లాక్‌బస్టర్ చిత్రం అల వైకుంఠపురంలో హీరోకి తల్లిగా నటించి మెప్పించారు. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, మరాఠీలతో పాటు హనుమాన్, ది నేమ్‌సెక్, లైఫ్ ఆఫ్ పై వంటి ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించారు. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో పాటు సినీ రంగానికి అందించిన సేవలకు గాను 2011లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కాగా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న పూరీ జగన్నాథ్ – విజయ్ సేతుపతి మూవీలో టబు ఓ కీలకపాత్ర చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఇకపోతే.. ఆల్రెడీ 50 క్రాస్ చేసిన టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ కపూర్, సాజిద్ నదియాడ్ వాలా, అక్కినేని నాగార్జున, అజయ్ దేవగణ్‌లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ హ్యాపీగా ఒంటరి జీవితం గడిపేస్తున్నారు టబు. ఇదిలాఉండగా.. టబుకి విచిత్రమైన అలవాటుంది. ఎంత లేట్ అయినా సరే రాత్రి పూట పడుకునే ముందు ఓ స్ట్రాంగ్ కాఫీ తాగుతారట. ఇండియాలో కానీ, ఫారిన్‌లో కానీ షూటింగ్‌లో ఉన్నా సరే తన ఫేవరెట్ కాఫీ బ్రాండ్‌ను తన వెంట తీసుకుని వెళ్తారట.
సాధారణంగా నిద్రకు రెండు మూడు గంటల ముందు కాఫీ, టీల వంటి పానీయాల జోలికి వెళ్లొద్దని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా ఖచ్చితంగా కాఫీ పడాల్సిందే నంటున్నారు టబు. మరి ఈ విషయంలో ఎంత మేరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం టబు అలవాటు తెలుసుకుని షాక్ అవుతున్నారు