వెబ్ డెస్క్ : తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్ (Prabhas). 45ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఇక హీరోయన్స్‌లో అయితే అనుష్క (Anushka) పెళ్లి చేసుకోకుండా ఉంది. అయితే నిత్యం సోషల్ మీడియా (Social Media)లో డార్లింగ్, అనుష్కల మీద ఏదోక న్యూస్ చక్కర్లు కొడుతునే ఉంటుంది. ‘మిర్చి’(Mirchi) సినిమాలో కలిసి జంటగా నటించిన వీరు అప్పటినుంచే ఆడియన్స్ దృష్టిలో పడ్డారు. ఆన్ స్క్రీన్ వీరి కెమిస్ట్రీ చాలా బాగుందని ఆఫ్ స్క్రీన్ కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావించారు.
కానీ దీనిపై ఆ జంట స్పందించలేదు. ఈ క్రమంలో అనుష్క, ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో అనుష్క, ప్రభాస్‌ను గట్టిగా హగ్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఏఐ (AI)సహాయంతో ఈ ఫొటోస్‌ను క్రియేట్ చేశారన్నట్లు క్లారిటీగా అర్థమయితుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ ఫొటోస్‌ను క్రియేట్ చేసిన వారిని ఘోరంగా తిట్టిపోస్తున్నారు. ఏఐని మంచి పనులకు యూజ్ చేయండి. ఇలా ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేయడానికి కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.