Home సినిమా Shruti Haasan: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్‌

Shruti Haasan: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్‌

655
0

‘ఆల్‌రౌండర్’ శృతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు కూతురిగా సినీ రంగంలో అడుగుపెట్టినా.. తన సొంత టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకుంది. నటనలో మాత్రమే కాకుండా డ్యాన్సర్‌గా, గాయనిగానూ మంచి పేరు సంపాదించింది. కొన్నాళ్ల విరామం తర్వాత ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ సినిమాలతో హిట్ కొట్టిన ఆమె త్వరలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు వెబ్‌సీరిస్‌, తమిళ చిత్రాల్లో కూడా శృతి హాసన్ బిజీగా ఉంది. మరో వైపు సోషల్ మీడియాలో సైతం అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

శృతి హాసన్ కొన్నేళ్ల కిందట యూకేకు చెందిన గాయకుడు మైఖెల్ కోరస్‌లే‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఆ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పి.. శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరు ముంబయిలో ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో చిట్‌చాట్ చేసిన శృతి.. వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ అభిమాని పెళ్లి గురించి అడగడంతో మండిపడింది. ప్రపంచంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత మరో అభిమాని సెక్స్ గురించి అడిగిన ప్రశ్న చూసి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.

ఆహారం, సెక్స్.. ఈ రెండిట్లో ఏది లేకుండా మీ రోజు గడవదు? అని అడిగిన ప్రశ్నకు శృతి సమాధానమిస్తూ.. ‘‘మీరు అడిగిన ప్రశ్నలో చెప్పడానికి ఏముంది? ఆహారం లేకుండా మీరు బతకగలరా? మీరు తిండి లేకుండా ఉంటే చూడాలని ఉంది. తిండి లేకపోతే చనిపోతామనే విషయం మీకు తెలీదా?’’ అంటూ శృతి హాసన్ మండిపడింది. అలాగే రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండగానికి గల కారణాన్ని కూడా శృతి చెప్పింది. తాను కావాలనే ఆ నిర్ణయం తీసుకున్నానని, సినిమాలపై ఆసక్తి లేకపోవడం వల్ల కాదని తెలిపింది. తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకోడానికి సమయం కేటాయించానని తెలిపింది. సినిమాలు చేస్తున్నప్పుడు సంగీతం మీద దృష్టి పెట్టడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు రెండిటి మీద సమాన బాధ్యతలు వహిస్తున్నానని చెప్పింది..