చీరాల : వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ యడం బాలాజీ చేపట్టిన నియోజకవర్గ పాదయాత్ర రెండోరోజు కొత్తపాలెం నుండి బయలుదేరింది. యాత్ర ప్రారంభం నుండి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై బాలాజీకి హారతులతో స్వాగతం పలికారు. కొత్తపాలెం, పాతచీరాల, దేవాంగపురి మీదుగా దేశాయిపేటకు చేరుకుంది. యాత్రలో వైసిపి కార్యకర్తల నినాదాలు, డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా నిర్వహించారు. కొత్తపాలెం, చీరాలనగర్ పంచాయితీల్లోని రైతులు, వ్యవసాయ కూలీలు బాలాజీ యాత్రకు ఎదురెళ్లి పరిచయం చేసుకున్నారు. బాలాజీని అభినందించారు. ఆప్యాయంగా పలుకరించారు.
దేవాంగపురి పంచాయితీ చీరాల – ఒంగోలు ప్రధాన రహదారిలో సాగిన పాదయాత్ర కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. రోడ్డు బారుకు జనంతో నిండటంతోపాటు డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో ఆకట్టుకున్నారు. వైఎస్ జగన్ మూడువేల కిలోమీటర్ల ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన యాత్రలో వైసిపి అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. యాత్రలో వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండ్రు బాబ్జి, నీలం శ్యామ్యుల్ మోజేస్, చీరాల పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు, చీరాల రూరల్ అధ్యక్షులు పిన్నిబోయిన రామకృష్ణ, వేటపాలెం అధ్యక్షులు కొలుకుల వెంకటేష్, పాతచీరాల సర్పంచి రాజు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కొరబండి సురేష్, ప్రతిపక్ష నాయకులు బురదగుంట ఆశ్వీర్వాదం, యువజన నాయకులు కోడూరి ప్రసాదరెడ్డి, షేక్ సుభాని, చిట్టిబాబు, యడం రవిశంకర్, సప్రం లవకుమార్ పాల్గొన్నారు.