Home బాపట్ల వైసిపీ అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం 

వైసిపీ అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం 

32
0

చీరాల : వైసీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులను ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. వైఎస్ఆర్సిపి చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ కరణం వెంకటేష్ సిఫార్సుతో వైసిపీ బీసీ సెల్ బాపట్ల జిల్లా అధ్యక్షులుగా గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా వాసుమల్ల వాసు, మునిసిపల్ వింగ్ అధ్యక్షులుగా బత్తుల అనిల్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులుగా చీమకుర్తి బాలకృష్ణను నియమిస్తూ ప్రకటించారు. నూతనంగా పదవీ బాధ్యతల్లో నియమితులైన వీరిని వైఎస్ఆర్సిపి నాయకులు చిలుకోటి శ్రీనివాసులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కోడూరి శివప్రసాద్ రెడ్డి, వైసిపీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి యాతం మేరి బాబు, చీరాల మండల నాయకులు అద్దంకిరెడ్డి, వేటపాలెం మండల నాయకులు ఉమ్ముటి శివ, తదితరులు అభినందించారు.