చీరాల : ఈపూరుపాలెంలో మంగళవారం జరిగిన గడప గడపకు వైసిపి కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జి యడం బాలాజి గ్రామస్థులతో మాట్లాడారు. వైసిపి అధికారానికి వస్తే అమలు చేసే నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలను వివరించారు. చేనేతలకు 45సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోలి అంజలీదేవి, ఎంపిటిసి గోలి ఆనందరావు, కాసులూరి సత్యనారాయణ, పొట్టేటి సుబ్బయ్య, సయ్యద్ నాగూర్, సయ్యద్ మస్తాన్, సయ్యద్ యాకుబ్, సయ్యద్ మౌలాలి, మహిళా అధ్యక్షులు పి మనోహరి, మద్దిబోయిన ఆదిశేషు, చీరాలనగర్ సర్పంచి రాజు శ్రీనివాసరెడ్డి, కె ఆదినారాయణ, యడం రవిశంకర్ పాల్గొన్నారు.