చీరాల : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ యడం బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైవిపి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి నందిగం సురేష్ బాబు, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణితోపాటు పార్టీ కార్యకర్తలు గడియారం స్థంభం సెంటర్లో ఉన్న దివంగతనేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పటల్లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొనిగల జైసన్ బాబు, మునిసిపల్ వైస్ చైర్మన్ కొరబండి సురేష్, బాబురావు, కొండ్రు బాబ్జి, సలగల అమృతరావు, ప్రతిపక్ష నాయకులు బురదాగుంట ఆశీర్వాదం, కోడూరి ప్రసాద్ రెడ్డి, ఎంపిటిసి గోలి ఆనందరావు, యడం రవిశంకర్ పాల్గొన్నారు.
అనంతరం అమ్మ కంటి వైద్యశాల ఆవరణలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైసిపి బాపట్ల పార్లమెంటు ఇన్‌ఛార్జి నందిగం సురేష్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
కార్యక్రమంలోకౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య, న్యాయవాది కర్నేటి రవికుమార్, కనపర్తి బజ్జిబాబు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, పేర్లి నాని పాల్గొన్నారు.